రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కు ఏడాది.. బదులు తీర్చుకుంటానన్న వైసీపీ రెబల్ ఎంపీ

Publish Date:May 14, 2022

Advertisement

రఘురామ కృష్ణం రాజు.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. వైసీపీ రెబల్ అయిన రఘురామకృష్ణం రాజు పేరు వింటే జగన్ పార్టీ నేతలకు చెమట్లు పడతాయి. నిశితంగా సొంత పార్టీ తప్పులను నిర్భయంగా, సూటిగా ఎత్తి చూపే రఘురామకృష్ణం రాజును దారిలోకి తెచ్చుకోవడానికి జగన్ పార్టీ చేయని ప్రయత్నం లేదు.

సామ,దాన, భేద, దండోపాయలన్నిటినీ ఉపయోగించి చేతగాక చేతులెత్తేసింది. రఘురామకృష్ణం రాజు మాత్రం అలుపెరుగని పోరాట యోధుడిగా సొంత పార్టీ  ప్రజా వ్యతిరేక నిర్ణయాల వ్యతిరేకంగా పోరు సాగిస్తూనే ఉన్నారు.  అటువంటి రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం. శనివారం ఆయన 60వ జన్మదినం. అంటే సరిగ్గా ఏడాది కిందట ఆయన 59వ జన్మదినోత్సవం రోజున జగన్ సర్కార్ ఆయనకు కస్టోడియల్ టార్చర్ ను పుట్టున రోజు బహుమతిగా ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆయన శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఆ బహుమతిని తాను జీవితంలో మరచిపోననీ, ప్రజలు తన వెంటే ఉన్నారనీ, ఏదో  ఒక రోజున బదులు తీర్చుకుంటాననీ చెప్పారు. రఘురామ కృష్ణం రాజు వైసీపీ ఎంపీ అయినా, తమ పార్టీ, అధినేత తీసుకునే తప్పుడు నిర్ణయాలు, అ మలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఏ మాత్రం వెనుకాడరు. మూడు రాజధానుల నిర్ణయం నుంచి వైసీపీ తీసుకున్న ప్రతి నిర్ణయంలోని లొసుగులు, దుర్మార్గపు ఆలోచనలను ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. తన రచ్చ బండ కార్యక్రమం ద్వారా జగన్ సర్కార్ తప్పిదాలను ఉతికేస్తూనే ఉన్నారు. శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రఘురామ రాజు గత ఏడాది ఇదే రోజున తనపై జగన్ సర్కార్ చేసిన పాశవిక దాడి గురించి గుర్తు చేసుకున్నారు. తన 59వ పుట్టిన రోజున అంటే ఏడాది కిందట ఇదే రోజున ఏపీ సీఐడీ తనను హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక ఎంపీనైన తనను అత్యంత దారుణంగా కొట్టారని  చెప్పారు.

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో పెంచి పోషిస్తున్న ఉన్మాది సంస్కృతిలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా జగన్ సర్కార్ ఘనంగా సన్మానించిందనీ, అందుకు ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలనీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఏడాది తన అరెస్టు, ఆ తరువాత తనను దారుణంగా హింసించడం వెనుక ఉన్నది ఏపీ సీఎం, మా పార్టీ అధినేత జగన్ ఉన్నారని విస్పష్టంగా చెప్పారు. జగన్ అరాచకాలకు 2024లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని రఘురామ కృష్ణం రాజు అన్నారు. నాడు కుట్ర పూరితంగా తనను అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారనీ, గుంటూరు సీఐడీ కార్యాలయంలో సీసీ కెమేరాలు తీసేసి, తన వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపేసి విచక్షణా రహితంగా కొట్టారనీ, దుర్భాషలాడారని రఘురామ కృష్ణంరాజు వివరించారు.

ఏ ఎంపీ అయినా తన పుట్టిన రోజును సొంత నియోజకవర్గంలో జరుపుకుంటారనీ, అయితే ఢిల్లీలో పుట్టిన రోజు జరుపుకునే ఏకైక ఎంపీని తానేనని చెప్పిన రఘురామ కృష్ణం రాజు ఏపీలో హింస పెచ్చరిల్లిందన్నారు. తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ గురించి లోక్ సభ స్పీకర్, సుప్రీం కోర్టులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన రఘురామ కృష్ణం రాజు వాటిపై రాష్ట్రపతి ఎన్నిక తరువాత కదలిక ఉంటుందని చెప్పారు.
ఏపీలో తెలుగుదేశం, జన సేనల మధ్య పొత్తులు ఉంటాయన్నారు. ఏపీలో పాలనపై ప్రజా వ్యతిరేకతకు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న స్పందనేనన్నారు. జనం జగన్ సర్కార్ ను సాగనంపేందుకు ప్రజలు నిర్ణయించేసుకున్నారనడానికి గడప గడపకూ వస్తున్న స్పందనే నిదర్శనమని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ప్రజా సంక్షేమం కోసం రాక్షస వధ జరిగి తీరాలనీ, , దీనికోసం రాజకీయాల్లో కొంతమంది కలయికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.  

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.