గడప గడపలోనూ వ్యతిరేకతే.. వైసీపీ ఎమ్మెల్యేలకు నిలదీతే!

Publish Date:May 14, 2022

Advertisement

ఖ్యమంత్రి జగన్ మాటను వైసీపీ ఎమ్మెల్యేలు వినే పరిస్థతిలో లేరు. అధినేత మాటను ఔదాల్చలేని పరిస్థితులు వారికి గడప గడపలోనూ ఎదురౌతున్నాయి. అందుకే జగన్ విస్పష్టంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం కొనసాగంచాలనీ, మంత్రులూ ఎమ్మెల్యేలు వెళ్లి తీరాలనీ హుకుం జారీ చేసినా  ఫలితం లేకపోయింది.

దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రారంభించనే లేదు. ప్రారంభించి ఇంటింటికీ వెళుతున్న వారికి కూడా నిలదీతలు, తిరస్కరణలే ఎదురౌతున్నాయి. కొండొకచో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఎదిరించిన వారికీ, నిలదీసిన వారికీ ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు జనం ముందే ధికారులకు ఆదేశాలిచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్ ప్రారంభించిన కార్యక్రమం గడప గడప కూ ప్రభుత్వ వ్యతిరేకతను మోసుకువెళ్లే కార్యక్రమంగా మారిపోయింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కాస్తా.. ప్రభుత్వ వ్యతిరేకతను విస్తరింప చేసే కార్యక్రమంగా మారిపోయింది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని నేతలు ఆ ప్రజలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి మరింతగా దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది.

ప్రభుత్వ పథకాలలోనూ, సంక్షేమ కార్యక్రమాలలోనూ  ఎక్కడా ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయని ఫలతమే.. ఇప్పుడు లబ్ధిదారులెవరో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలియని పరిస్థితి నెలకొంది. వలంటీర్లో, అధికారులో ఇచ్చిన జాబితా పుచ్చుకుని ఇళ్లకు వెడుతున్న వైసీపీ నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. విద్యుత్‌ బిల్లులు, త్తపన్ను,ఇంటిపన్నుఇలా బాదేస్తుంటే ఎల బతికేదన్న జనం ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  

సగం మంది  అయితే ఎందుకొచ్చిన పంచాయితీ గడప దాటకపోతే పోలా అన్న ఉద్దేశంతో అధినేత ఆదేశాలను సైతం బేఖాతరు చేసి గడప గడపకూ కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదు. ఏవో సాకులు చెబుతూ జనం మధ్యకు వెళ్లకుండా దాటవేస్తున్నారు. కొందరు సీనియర్లైతే గడప గడపకూ కార్యక్రమాన్ని గ్రామ సభ స్థాయికి కుదించేసి మమ అని పిస్తున్నారు. చాలా మంది మంత్రుల ఇలాకాలలో ఈ కార్యక్రమం ప్రారంభమే కాలేదు. జనంలోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరసనల సెగ తగులుతుండటంతో మిగిలిన వారు ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఈ కార్యక్రమానికి మొహం చాటేస్తున్నారు.  

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.