గడప గడపలోనూ వ్యతిరేకతే.. వైసీపీ ఎమ్మెల్యేలకు నిలదీతే!
Publish Date:May 14, 2022
Advertisement
ఖ్యమంత్రి జగన్ మాటను వైసీపీ ఎమ్మెల్యేలు వినే పరిస్థతిలో లేరు. అధినేత మాటను ఔదాల్చలేని పరిస్థితులు వారికి గడప గడపలోనూ ఎదురౌతున్నాయి. అందుకే జగన్ విస్పష్టంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం కొనసాగంచాలనీ, మంత్రులూ ఎమ్మెల్యేలు వెళ్లి తీరాలనీ హుకుం జారీ చేసినా ఫలితం లేకపోయింది. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రారంభించనే లేదు. ప్రారంభించి ఇంటింటికీ వెళుతున్న వారికి కూడా నిలదీతలు, తిరస్కరణలే ఎదురౌతున్నాయి. కొండొకచో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఎదిరించిన వారికీ, నిలదీసిన వారికీ ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు జనం ముందే ధికారులకు ఆదేశాలిచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్ ప్రారంభించిన కార్యక్రమం గడప గడప కూ ప్రభుత్వ వ్యతిరేకతను మోసుకువెళ్లే కార్యక్రమంగా మారిపోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కాస్తా.. ప్రభుత్వ వ్యతిరేకతను విస్తరింప చేసే కార్యక్రమంగా మారిపోయింది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని నేతలు ఆ ప్రజలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి మరింతగా దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ప్రభుత్వ పథకాలలోనూ, సంక్షేమ కార్యక్రమాలలోనూ ఎక్కడా ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయని ఫలతమే.. ఇప్పుడు లబ్ధిదారులెవరో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలియని పరిస్థితి నెలకొంది. వలంటీర్లో, అధికారులో ఇచ్చిన జాబితా పుచ్చుకుని ఇళ్లకు వెడుతున్న వైసీపీ నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. విద్యుత్ బిల్లులు, త్తపన్ను,ఇంటిపన్నుఇలా బాదేస్తుంటే ఎల బతికేదన్న జనం ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సగం మంది అయితే ఎందుకొచ్చిన పంచాయితీ గడప దాటకపోతే పోలా అన్న ఉద్దేశంతో అధినేత ఆదేశాలను సైతం బేఖాతరు చేసి గడప గడపకూ కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదు. ఏవో సాకులు చెబుతూ జనం మధ్యకు వెళ్లకుండా దాటవేస్తున్నారు. కొందరు సీనియర్లైతే గడప గడపకూ కార్యక్రమాన్ని గ్రామ సభ స్థాయికి కుదించేసి మమ అని పిస్తున్నారు. చాలా మంది మంత్రుల ఇలాకాలలో ఈ కార్యక్రమం ప్రారంభమే కాలేదు. జనంలోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరసనల సెగ తగులుతుండటంతో మిగిలిన వారు ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఈ కార్యక్రమానికి మొహం చాటేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/people-angry-on-gadapagadapaku-mlas-facing-protests-25-135879.html





