పెట్టుబడుల వేటలో నారా లోకేష్ యునీక్ స్టైల్.. సియోల్ లో మెగా ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో..!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఐటీ రంగాల భవిష్యత్తును మార్చేసే దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.  దక్షిణ కొరియా పర్యటనలో  భాగంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు, సాధిస్తున్న సత్ఫలితాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక వృద్ధిపై అనేక సందేహాలు, విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో, ప్రస్తుత  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. దిగ్గజ సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. 

ఈ పర్యటనలో లోకేష్  షూఆల్స్, సోలమ్, అపాక్ట్, బూ యంగ్, హ్వాసుంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు, శాంసంగ్ , ఎల్‌జీ  వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు  ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మౌలిక వసతులను వారికి సమగ్రంగా వివరించి వారు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సుకత, ఆసక్తి చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.

 కాగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ యత్నాలలో భాగంగా నారా లోకేష్ వినూత్నంగా..  దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఒక భారీ పారిశ్రామిక రోడ్‌షోను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ కొరియా బిజినెస్ ఫోరమ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్ రోడ్‌షో జరిగింది. ఒకే వేదికపై నుంచి వందలాది మంది అగ్రశ్రేణి పెట్టుబడిదారులను, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులను ఆకట్టుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విదేశీ గడ్డపై ఇలాంటి సరికొత్త   పారిశ్రామిక వ్యూహాన్ని అమలు చేయడం లోకేష్‌లోని మోడరన్  లీడర్‌షిప్ స్కిల్స్‌కు నిదర్శనమన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వ్యతిరేకించిన పక్క రాష్ట్రాల నేతలు సైతం ఇప్పుడు లోకేష్ అనుసరిస్తున్న వినూత్న పారిశ్రామిక సంస్కరణలు ..  ఆయన చూపిస్తున్న చొరవను ఆదర్శంగా తీసుకుంటున్నారు.  

Andhra Pradesh Investments, Seoul Business Roadshow, Samsung LG Meeting, AP IT Minister, AP Industrial Reforms

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.