Publish Date:Mar 27, 2026
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏపీ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజ్ కేసిరడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. షాబాద్‌లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం రూ. 2.69 కోట్లుగా చూపించారు. అలాగే జనగామలో తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరుతో లక్షల రూపాయల విలువైన ప్లాట్లు కొన్నట్లు సిట్ గుర్తించింది.
ఈ ఆస్తుల జప్తునకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ, సిట్ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా గుర్తించిన రూ. 70 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలుకు సిట్ ప్రభుత్వ అనుమతి కోరగా, ప్రభుత్వం అందుకు అనుమతించింది. దీంతో నేడో రేపే సిట్ ఏసీబీ కోర్టులో ఈ ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-sarkar-ok-to-attach-rajkesireddy-binami-assets-36-216262.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.