ప్రైవేటు పోలీసు పార్టీ.. వైసీపీ తెగింపు, అరాచకత్వాం పీక్స్ కి.!
Publish Date:Aug 11, 2026
Advertisement
ప్రతిష్ఠ పరంగా ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అసెంబ్లీకి ముఖం చాటేయడం దగ్గర నుంచి, వైసీపీ అధినేత జగన్ చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వరకూ వైసీపీ చర్యలన్నీప్రజలకు దూరం జరిగేలాగే ఉన్నాయి. వైసీపీ అధినేత అడపాదడపా చేపట్టే నిరసన కార్యక్రమాలలోనూ ఆ పార్టీ జనాలకు చేరువకావడం అటుంచి అతి తీరుతో దూరం అవుతూనే వస్తోంది. తాజాగా మెగా డీఎస్సీలో అక్రమాలంటూ చేపట్టిన నిరసన కార్యక్రమాలలో వైసీపీ తెగింపు ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలను తప్పుపడుతూ... మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన నిర్వహించి, వైసీపీ ఆందోళనలకు వ్యతిరేకంగా నినదించారు. ఆత్మగౌరవం పేరుతో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు నిరసనకు దిగడంతో.. వైసీపీ కంగుతింది. అయినా మెగా డీఎస్సీ వ్యతిరేక ఆందోళన ఆపలేదు సరికదా.. ఏకంగా తమ నిరసనలకు సొంతంగా ప్రైవేట్ పోలీసు పార్టీనే ఏర్పాటు చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రైవేటు పోలీస్ సైన్యం రంగంలోకి దిగింది. పోలీసులు, చిహ్నాలు ధరించిన ప్రైవేటు పోలీసు పార్టీ వైసీపీ నిరసనల్లో ప్రత్యక్షం కావడంతో.. నిజమైన పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ప్రైవేట్ పోలీసులను అదుపులోనికి తీసుకున్నారు. ఎందుకంటే.. చట్ట ప్రకారం.. ప్రభుత్వ పోలీస్ యూనిఫామ్‌ను గానీ, పోలీస్ చిహ్నాలను గానీ పోలి ఉండే దుస్తులు ధరించడం నేరం. పోలీస్ శాఖ ఉపయోగించే ప్రత్యేకమైన బిల్లలు, స్టార్లు , టోపీలు వంటివి ప్రైవేటు వ్యక్తులు వాడటం శిక్షార్హమైన నేరం. ఆ నేరం చేసినందునే.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగగా వైసీపీ ప్రైవేటు పోలీసులకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజనులు వైసీపీ తెగింపునకు, అరాచకత్వానికీ ఇది పరాకాష్ఠ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. AP Private Police party, YSRCP DSC Protest, Chandragiri , Law Violation, AP Politics, TeluguOne
http://www.teluguone.com/news/content/ap-private-police-party-36-228656.html




