మంత్రి మేకపాటి హఠాన్మరణం.. ఎలా జరిగిందంటే..

Publish Date:Feb 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇటీవలే దుబాయ్ వెళ్లి, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఓ వివాహ రిషప్షన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సోమవారం ఉదయం  7:30 గంటలకు తన ఇంటిలోనే గౌతమ్ రెడ్డికి గుండె పొటు వచ్చింది. వెంటనే ఆయనను అపొలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డిని ఆస్పత్రికి తీసువచ్చేటప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని అపోలో వైద్యులు తెలిపారు.గౌతమ్ రెడ్డిని బ్రతికించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశామని, అయిప్పటికీ లాభం లేకుండా పోయిందని వైద్యులు వెల్లడించారు.


 ప్రస్తుతం గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన అనంతరం రేపు ముఖ్య మంత్రితో గౌతమ్ రెడ్డి సమావేశం కావలసి ఉంది. ఈ లోపే ఆయన మరణించడంతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ శ్రేణుల్లో  తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. గౌతమ్ రెడ్డికి భార్య– శ్రీకీర్తి, కుమార్తె అన్యన్యరెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో 1971  నవంబర్ 2 న జన్మించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మణిమంజరి గౌతమ్ రెడ్డి తల్లిదండ్రులు. యూకేలోని మాంచెస్టర్ యూనివర్శిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ టెక్స్టైల్స్ చదివారు. కేఎంసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా గౌతమ్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మేకపాటి రాజ మోహన్ రెడ్డి రాజకీయ వారసుడిగా 2014 లొ రాజకీయాల్లో కి 2014లొకి వచ్చిన గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీచేసి 30,191 ఓట్ల మెజారితో గెలిచారు. 2019 కూడా అక్కడ నుండి  రెండవసారి గెలిచి మంత్రి అయ్యారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీజినామా చేసి వైసీపీలో చేరడానికి గౌతమ్ రెడ్డి కారణమయ్యారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి చదువుకున్న గౌతమ్ రెడ్డి ఆయన స్నేహం కోసం వైసీపీలో చేరారు.

గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో మంగళవారం ఆయన అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బంధువులు హైదరాబాద్ అపొలో హాస్పిటల్ కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేసేందుకు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్ స్థానాల నుంచి ఎంపీగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.