గౌతమ్‌రెడ్డి మృతికి దిగ్భ్రాంతి.. జగన్, చంద్రబాబు సంతాపం..

Publish Date:Feb 21, 2022

Advertisement

ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా మరణించడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచీ సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్రెడ్డి అని, మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందని సీఎం జగన్ సంతాపం వెలిబుచ్చారు. గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలిపారు. గౌతమ్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించేందుకు జగన్ కాసేపట్లో హైదరాబాద్ బయల్దేరి వెళ్తున్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి తనను కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం అని ఆయన దిగ్భ్రాంతి వ్యవక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి బాధాకరమని అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి వంటి యువనేత ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తమ సహచరుల్లో సీఎం జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకురావడం వెనక గౌతమ్ రెడ్డి విశేష కృషి ఉందని ధర్మాన గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్ రెడ్డి వ్యాయామాలు కఠినంగా చేసేవారని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని, ఆయన ఇక లేరన్న వార్త చాల బాధ కలిగించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి తనకు బంధువు అని సోమిరెడ్డి చెప్పారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నెల్లూరు జిల్లా అత్మకూరులోని గౌతమ్ రెడ్డి కార్యాలయం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. తమ అభిమాన నేత ఇకలేరని ఆత్మకూరులో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌టీపీ అధినేత్ర ష‌ర్మిల‌, ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ‌లు.. హైద‌రాబాద్‌లో మేక‌పాటి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ఓదార్చారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.