ఇది ఆరంభం మాత్రమే.. ముందుముందు అంతకుమించి...
Publish Date:Feb 20, 2022
Advertisement
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ముంబై వచ్చిన సీఎం కేసీఆర్... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధనాలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించినట్టు.. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని కేసీఆర్ చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని.. అనేక మార్పులు రావాల్సి ఉందన్నారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని.. వైఖరి మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు.. ఈ రెండు రాష్ట్రాల మధ్య 1000 కి.మీ మేర ఉమ్మడి సరిహద్దు ఉంది.. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరముంది.. ఉద్ధవ్ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించానని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘ఈ చర్చలు ఆరంభమే.. ముందుముందు పురోగతి ఉంటుంది. మా చర్చల్లో రహస్యమేమీ ఉండదు. దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోంది. ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచిది కాదు. సోదర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ కలిసి నడుస్తాయి.. అన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. గంటన్నర పాటు వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. త్వరలోనే మిగతా భావసారూప్య పార్టీలతోనూ కలిసి.. చర్చించి.. ఒక ఉమ్మడి ఎజెండా రెడీ చేస్తామన్నారు.
http://www.teluguone.com/news/content/kcr-maharastra-tour-updates-39-132044.html





