స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.!

Publish Date:Oct 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా   ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అడ్డంకి కూడా హైకోర్టు తీర్పుతో ఏర్పడింది. అదేంటంటే.. స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్ల శాతం ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకూడదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టినట్లుగా తన తీర్పులో పేర్కొంది.  బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ తీర్పు ఎదురదెబ్బగా పరిణమించింది. 

దీంతో ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీసీ వర్గాలు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ  వెన్నంటి నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం కల్పించడం పార్టీకి, అధికార కూటమికి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. అందకే బీసీ లకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా ప్రభుత్వం అన్ని రకాల చట్టపరమైన ప్రయత్నాలు చేసేందుకు సిద్ధపడింది.  అందులో భాగంగానే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది.

అదలా ఉంటే..  తీర్పుపై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బీసీలకు రాజకీయంగా అత్యున్నత ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి జీవోలు జారీ చేసిందని, గతంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, రాజకీయ విధానాల వల్ల అనేక మంది వెనుకబడిన వర్గాల నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం లభించిందని అన్నారు.

అయితే..  ప్రత్యర్థులు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించడం వల్ల బీసీల రాజకీయ హక్కులకు విఘాతం కలుగుతోందన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన మరోసారి గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే  హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది.  ఢిల్లీలోని ప్రముఖ సీనియర్ న్యాయవానులతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది.   రెండు మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపోరాటం చేసి, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

[AP Local Body Elections,   BC Reservations, Andhra Pradesh High Court Verdict, Supreme Court Petition, AP Government, Telugu One]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.