కుంభమేళాను తలదన్నేలా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు.!

Publish Date:Aug 11, 2026

Advertisement

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పవిత్ర ఘట్టాన్ని నభూతో అన్న చందంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ లో  అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుసంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది.  దక్షిణ భారత కుంభమేలాగా భావించే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సారి పుష్కారాలకు పది కోట్ల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పుష్కరాలకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకుఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కుంభమేలా ఏర్పాట్లను తలదన్నేలా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.  భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణకు చర్యలు,  మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఇప్పటికే చర్యలు ప్రారంభించి పకడ్బందీగా ముందుకు సాగుతోంది.  పుష్కరాల నిర్వహణ నభూతో అన్నట్లుగా నిర్వహించడంతో పాటు..  రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఇతర తీర ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. శాశ్వత మౌలిక వసతుల కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయల పనులకు పాలనా అనుమతులు మంజూరు చేసింది.

పుష్కరాల నిర్వహణలో భాగంగా మున్సిపల్,  పర్యాటక, దేవాదాయ,  నీటిపారుదల శాఖలు సమన్యయంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాయి.  ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 150 కోట్ల నిధులలో సింహభాగం అంటే వంద కోట్ల రూపాయలు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు, కొవ్వూరు మున్సిపాలిటీకి   20 కోట్లు, నర్సాపురం మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది.  ఇంకా నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక నిధులను కేటాయించింది. ఈ నిధులతో  రోడ్ల వెడల్పు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ,  విద్యుద్దీపాల ఏర్పాటు పనులను చేపడతారు. 

గోదావరి  తీరం పొడవునా కొత్తగా  పుష్కర ఘాట్లను నిర్మించడంతో పాటు, గతంలో ఉన్న ఘాట్లకు సమగ్ర మరమ్మతులు చేపట్టనున్నారు. పుష్కర ఘాట్ల వద్ద   తొక్కిసలాటలు జరగకుండా, భక్తులకు ఎటువంటి  ఇబ్బందులు ఎదురుకాకుండాఏర్పాట్లు చేస్తున్నారు.  ఘాట్ల వద్ద నిరంతర నీటి శుద్ధి, మహిళలకు బట్టలు మార్చుకునే ప్రత్యేక గదులు, అత్యవసర వైద్య శిబిరాలు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే.. గోదావరి తీరంలో తాత్కాలికంగా సువిశాలమైన  టెంట్ సిటీలు  ఏర్పాటు, హోమ్‌స్టే ఏర్పాట్లు చేయడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.   అలాగే..  రాజమహేంద్రవరం నుంచి గోదవరి నదిపై పాపికొండల విహారయాత్ర, బోటింగ్ సదుపాయాలను  భద్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం సర్కార్ అధికా రులను ఆదేశించింది.  12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గోదావరి పుష్కరాలు ఈ సారి వచ్చే ఏడాది  జూన్ 26 నుండి జులై 7 వరకు జరుగుతాయి.  

AP government Preparations for Godavari Pushkaralu, Godavari Pushkaralu,  AP Government Funds, Rajamahendravaram,  Pushkaram Ghats, Infrastructure

By
en-us Political News

  
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.