ఉప ఎన్నికలపై పందేలకు వెబ్ సైట్ ఏర్పాటు?

Publish Date:Jun 2, 2012

Advertisement

రాష్ట్రంలో ఉప ఎన్నికలపై ముమ్మరంగా పందేలు కాస్తున్నారు. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 15 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం గెలుపొందుతుందంటూ కొందరు కోట్లాదిరూపాయల పందేలు కాస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జనగ్మోహనరెడ్డిని అక్రమాస్తుల కేసులో సిబీఐ అరెస్టు చేయటంతో సానిభూతి ఓట్లతో ఆ పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకాలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల నుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కు వలస వెళుతుండటం కూడా పందెంరాయుళ్ళను రెచ్చగొడుతోంది. ఆ పార్టీ తరపున పందెం కాస్తే తమకు రెట్టింపు వస్తుందన్న నమ్మకమూ వారికి ఎక్కువయింది.


 


'తెలుగువన్.కామ్' పరిశీలనలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలే తమ అనుచరుల్లో కొందరిని పందెం కాసి డబ్బు సంపాదించుకోమని ఉసికోల్పుతున్నారు. అందుకే ఒక్క తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎన్నికలపై దాదాపు 50కోట్ల రూపాయల పైచిలుకు బెట్టింగులున్నాయని విశ్వసనీయ సమాచారం. విజయమ్మ పర్యటన తరువాత ఈ బెట్టింగ్ ల జోరు మరింగ పెరిగే అవకాశం ఉండి. వీరికోసమే కొత్తగా ఒక వెబ్ సైట్ ను కూడా రెండు రోజుల్లో తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు. మట్కాజూదంలానే ఈ వెబ్ సైట్ కూడా కోడ్ ల ఆధారంగా పనిచేస్తుందనీ, నియోజకవర్గాలకు నెంబరింగ్ లు ఇచ్చి గెలుపు, ఓటమి పందేలను నడుపుతారని సమాచారం. అయితే ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ముందుగానే అప్రమత్తమైన పోలీసులూ ఈ ఎన్నికల బెట్టింగ్ పై నిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెట్టింగ్ ల తీరును పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి, అనంతపురం ప్రాంతాల నుంచి బెట్టింగ్ లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ధీమాతో పందేలకు ఎగబడుతున్నారట. ఏదేమైనా ఎన్నికలపై బెట్టింగ్ ల గురించి ఇసి ముందుగా అప్రమత్తం అయ్యిందన్న సమాచారం పందెంరాయుళ్ళకు తెలిసి పేర్లు, వివరాలు బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తలూ పాటిస్తున్నారు. ఈ పందేలను కోడ్ ల ఆధారంగా ప్రాంతాలవారీగా విభజించటానికీ ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. నియోజకవర్గానికి నెంబర్లు, ప్రాంతాల వారీగా బెట్టింగ్ రాయుళ్ళకు కోడ్ లు ఇచ్చి పందెంరాయుళ్ళు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటారన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.