హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

Publish Date:Apr 28, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్ ప్రాంతంలో ఉన్న సోఫా, ఫర్నిచర్ వర్క్‌షాప్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే విస్తృతంగా వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో పరిసర ప్రాంతమంతా ఆవరించిపోయింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

అయితే సమీపంలోని బారాదరి అగ్నిమాపక కేంద్రం నుంచి తక్షణ స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన ఆలస్యంగా వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్, సోఫా సెట్లు, ప్లైవుడ్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

By
en-us Political News

  
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది.
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.