విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా అన్నాహజారే మౌన దీక్ష.!

Publish Date:Jul 23, 2026

Advertisement

 

ఢిల్లీలో  తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళణ చేస్తున్న విద్యార్థులకు సామాజిక కార్యకర్త, గాంధేయ వాది అన్నా హజారే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ..తన స్వస్థలమైన మహారాష్ట్ర  అహల్యానగర్లో ఆయన గురువారం (జులై 23) ఒక రోజు మౌన దీక్ష చేపట్టారు.

 తన అనుచరులు, స్థానికులతో  కలసి  ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో  వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.   

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల ఆవేదనను కేంద్రం తక్షణమే గుర్తించి వారి  డిమాండ్లను నెరవేర్చాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు,  విద్యా వ్యవస్థలో సంస్కరణల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు.  హక్కుల సాధన కోసం వీధుల్లోకి వచ్చిన విద్యార్థులను నిర్బంధించడం, వారి ఆందోళనను అణచివేయడం సరికాదన్న ఆయన.. కేంద్రం తక్షణమే వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలన్నారు.  

Silent Protest, Anna Hazare Support, Student Movement Delhi

By
en-us Political News

  
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.