ఎన్నికలకు ముందే ఓడిన ఆనం సోదరులు
Publish Date:Mar 22, 2012
Advertisement
నెల్లూరుజిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో అనుకున్నదే జరిగింది. జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఆనం సోదరులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. గెలుపు మాట అటుంచితే కాంగ్రెస్ అభ్యర్థికి ద్వితీయస్థానం కూడా దక్కకపోవడంతో ఆనం సోదరులకు గట్టి దెబ్బ తగిలినట్లు భావించాల్సి వస్తోంది. నిజానికి ఆనం సోదరులు ఉప ఎన్నికలు జరగడానికి ముందే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించారు. కోవూరు సీటు కాంగ్రెస్ పార్టీది కాదని, అక్కడ తాము గెలిచినా గెలవకపోయినా పెద్ద తేడా లేదని పోలింగ్ ముందు ప్రకటించారు. దీనిపై కొందరు సీనియర్ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో సోదరులు మాట మార్చి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించి అసెంబ్లీకి పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. కానీ ఫలితాలు మాత్రం వారికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కోవూరులోనే కాకుండా త్వరలో జరగబోయే ఉదయగిరి, నెల్లూరు ఉప ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఆనం సోదరుల రాజకీయ భవిష్యత్తుకు తెర పడినట్లే అవుతుంది. కోవూరు నియోజకవర్గంలో చిరంజీవి రేను రోజులపాటు ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రభావం కూడా కాంగ్రెస్ అభ్యర్ధికి ఏమీ పనిచేయలేదు.
http://www.teluguone.com/news/content/anam-brother-congress-party-leaders-24-12854.html





