ఆమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రద్దు.. ఎందుకంటే?

Publish Date:Jul 4, 2026

Advertisement

అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసుకుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం  స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సన వేడుకలను  దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించ తలపెట్టింది.  వాషింగ్టన్ డీసీలో సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే అనూహ్యంగా ఆ వేడుకలను రద్దు చేసింది. ఇందుకు ప్రధాన కారణం వాతావరణం.  

అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు,  వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.  భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.  

జాతీయ వాతావరణ సంస్థ  మేరకు, ప్రస్తుతం అమెరికాలో దాదాపు 16 కోట్ల మంది ప్రజలు ఎండతీవ్రతకు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతమంతా భానుడి భగభగలకు విలవిలలాడిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత బిజీ నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో హీట్ ఇండెక్స్ ఏకంగా 105 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు   చేరుకుంది.  ఎండల తీవ్రత కారణంగా  గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫేర్ ఉత్సవాలను సైతం సస్పెండ్ చేశారు.  

ఈ అసాధారణ వేడి ప్రభావం కారణంగా గృహాలు, కార్యాలయాల్లో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో విద్యుత్ గ్రిడ్లపై  భారీ ఒత్తిడి పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో పవర్ గ్రిడ్లు ఫెయిల్ అయి, వేలాది మంది ప్రజలు కరెంట్ లేక ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ఎండల దెబ్బ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లపైన కూడా పడింది. ఆటగాళ్లు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య  మ్యాచ్‌ల మధ్యలో ప్రత్యేకంగా 'హైడ్రేషన్ బ్రేకులు తప్పనిసరి చేస్తూ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే అత్యంత ఘనంగా జరగాల్సిన  అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.  

USA extreme heat wave, Washington DC heat warning, US power grid failure, New York, Teluguone

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.