అమరావతి టు హైదరాబాద్, చెన్నై బుల్లెట్ ట్రైన్

Publish Date:Apr 28, 2026

Advertisement

 

అమరావతి నుంచి  హైదరాబాద్‌, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని  వైష్ణవ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 08 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. చెన్నై నుంచి కోల్‌కతా మధ్య రైల్వే లైన్లను 4 లేన్లుగా విస్తరించే పనులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్‌ను నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. 

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీ పట్నం కాబోతోందన్న కేంద్ర మంత్రి... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు.  విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సైబరాబాద్‌ నిర్మించారని.. ఐటీ అభివృద్ధిలో సైబర్‌ టవర్‌ది కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని అన్నారు. ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అభివర్ణించారు. యువనేత లోకేశ్ ఎనర్జీ, నాయకత్వం అద్భుతమని కొనియాడారు. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేశ్ ఆదర్శమని పేర్కొన్నారు. గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలు విశాఖపట్నానికి రావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

By
en-us Political News

  
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.