Publish Date:Apr 28, 2026
కడపలో వైసీపీ అభిమానుల సంబరాలు..
పలుచోట్ల మిఠాయిలు పంచుతూ హంగామా..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.
అయితే, ఈ కేసులో సీబీఐ పూర్తి చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఇకపై విచారణకు ఆయన అవసరం లేదని భావించిన హైకోర్టు, గతంలో విధించిన షరతులను సడలిస్తూ తాజా ఆదేశాల్లో ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లభించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన అనుచరులు, వైసీపీ అభిమానులు కడపలో సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.
వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది సహజ మరణం కాదనీ, హత్యని పేర్కొన్నారు.15వ తేదీ సాయంత్రం చేసిన పోస్టుమార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయనీ, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలు ఉన్నాయనీ తేలింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటుచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-bhaskar-reddy-granted-bail-in-viveka-murder-case-36-218499.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.