ట్రంప్‌పై కాల్పులు ఘటన...నిందితుడి హెచ్చరిక లేఖ బయటకి

Publish Date:Apr 28, 2026

Advertisement

 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు కోల్ టొమాస్ అలెన్‌కు సంబంధించి ఒక షాకింగ్ నోట్ బయటపడింది.

దాడికి ముందే నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఒక లేఖను పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లేఖలో ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడం గమనార్హం. ఆయనను ఒక అత్యాచార నిందితుడిగా, పిల్లలను వేధించే వ్యక్తిగా, ద్రోహిగా అభివర్ణిస్తూ నిందితుడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. "ఇలాంటి లక్షణాలున్న వ్యక్తిని నేను సహించను" అని అందులో స్పష్టం చేయడం కలకలం రేపుతోంది.

కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనే దానిపై నిందితుడు ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. తన దారికి అడ్డు రానంత వరకు సాధారణ అతిథులను, సిబ్బందిని లేదా సెక్రెట్ సర్వీస్ ఏజెంట్లను తాను లక్ష్యం చేసుకోనని కూడా ఆ నోట్‌లో పేర్కొన్నాడు.

అంతేకాకుండా, వైట్‌హౌస్ వద్ద భద్రతా లోపాలను కూడా నిందితుడు ఎండగట్టడం గమనార్హం. భారీ రైఫిల్‌ను తీసుకుని తాను లోపలికి వచ్చినా, ఎవరూ గుర్తించలేదని, భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో దీనిని బట్టే అర్థమవుతోందని పేర్కొన్నాడు. నిందితుడి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా భద్రతా సంస్థలను ఆత్మరక్షణలో పడేశాయి.

ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను వివరణ కోరగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు రాసిన నోట్‌లోని ఆరోపణల గురించి రిపోర్టర్ ప్రశ్నించగా, ట్రంప్ వెంటనే స్పందిస్తూ.. "అతడు తన కోసం తాను రాసుకున్నది. నేను ఎలాంటి నేరాలు చేయలేదు, నేను నిర్దోషిని" అని బదులిచ్చారు. అవాస్తవ ఆరోపణలను తనతో ముడిపెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అధికారులు ఈ నోట్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులనే నిందితుడు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన భద్రతా పరమైన చర్చలకు దారితీయడంతో, భవిష్యత్తులో రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

By
en-us Political News

  
మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.