దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ ఏఐ గూగుల్ హబ్ : సీఎం చంద్రబాబు

Publish Date:Apr 28, 2026

Advertisement

 

సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే శంకుస్థాపన చేశారు. 

శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా పాల్గొన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 601 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్ పీరియెన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”ఏపీ చరిత్రలో కొత్త టెక్ శకానికి శ్రీకారం చుడుతున్న రోజు ఇది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపికి ఓ గేమ్ చేంజర్. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ నగరాన్ని ఐటీ సిటీగా నిర్మాణం చేస్తే సంపద సృష్టికి కేంద్ర అయ్యింది. 

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత చరిత్రలో 2026 ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుంది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ తలెత్తుకుని నిలబడుతుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది. దేశానికి ఏఐ డేటా గేట్ వేగా ఏపీ నిలుస్తుంది. సెర్చ్ ఇంజన్‌గా మొదలైన గూగుల్ సంస్థ... భారత్ గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది. ప్రతీ ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏపీని సెలెక్ట్ చేసుకుంది”అని ముఖ్యమంత్రి చెప్పారు.

సీఎంఓ సెక్రటరీగా గూగుల్ ఏఐ అసిస్టెంట్

“ఏపీ ప్రభుత్వం అందిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్సుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ నుంచి కూడా సహకారం తీసుకుంటాం. సీఎంఓలోని నలుగురు కార్యదర్శులతో పాటు నాకు కొత్తగా ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలన అందించేందుకు సహకారం అందిస్తుంది. గూగుల్ రావటంతో విశాఖలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 

ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, వెనకబాటుతనం, నిరుద్యోగం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారు. ట్యాలెంట్ మైగ్రేషన్ ముగిసింది. విశాఖ ఇకపై టాలెంట్‌కు డెస్టినీగా నిలవనుంది. విశాఖకు గూగుల్ సెంటరును తీసుకురావడంలో లోకేష్ చొరవను ప్రశంసిస్తున్నాను. 

లోకేష్ తొలిసారి గూగుల్ సెంటర్ సందర్శించినప్పుడు విశాఖకు గూగుల్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ తర్వాత అది సాకారమైంది. గూగుల్ సంస్థ ఇండియాలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే... పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.. 

చెప్పినట్టుగానే సహకరించారు. లోకేష్ చొరవ... ప్రధాని సహకారంతో విశాఖలో గూగుల్ ప్రాజెక్ట్ సాకారమైంది. ప్రతిష్టాత్మక అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయి. 2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నాను. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ ప్రాంతానికి నీటి సమస్య లేదు. 60 రోజుల్లోనే గోదావరి నీరు విశాఖకు తీసుకువస్తాం.”అని సీఎం భరోసా ఇచ్చారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది.
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది.
అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది
ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, స్థిరాస్తులను పొందారు. ఈ మొత్తం విలువ రూ. 9.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అషు రెడ్డి మొహం చాటేయడమే కాకుండా.. తనపైనే తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పల్నాడులో ఇంధన విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న మూడు పెట్రోల్ బంకులను కలెక్టర్ సీజ్ చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న మూడు ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేశారు.
శివారు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ఉరేసి చంపేసి అనంతరం తానుకూడా ఆ చెట్టుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.