ఘనంగా అక్కన్న మాదన్న మహంకాళి ఘటం ఊరేగింపు..!

Publish Date:Aug 10, 2026

Advertisement

 

పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఘటం ఊరేగింపు ను ప్రారంభించారు. అంత కుముందు ఆలయాన్ని సందర్శించిన సీపీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. విశిష్ట చరిత్ర కలిగిన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో పవిత్రమైన ఘటం ఊరేగిం పును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు, వరదల సమయంలో ప్రజలను కాపాడిన మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నగర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

ఘటం ఊరేగింపు జరిగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా, అవాం ఛనీయ సంఘటనలకు తావులేకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వ యంతో విస్తృత బందో బస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. హరిబౌలి లోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ఘటం ఊరేగింపు గౌలిపురా, లాల్‌దర్వాజ, శాలిబండ మీదుగా సాగి నయాపూల్ వద్ద ముగి యనుంది. గత నెల రోజులుగా గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తుల సహకారంతో ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని సీపీ సజ్జనర్ తెలిపారు. 

బోనాల ఉత్స వాలను విజయవంతం చేసిన ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులకు హైదరాబాద్ నగర పోలీసుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, డీసీపీ టాస్క్‌ఫోర్స్ వైభవ్ గైక్వాడ్, ఐపీఎస్, డీసీపీ చార్మినార్ జోన్ ఖారే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్, డీసీపీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఆర్. వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ, సలహాదారు రాజారత్నం తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Akkanna madanna, old city, Laldarwaja, Nayapool, CP Sajjanar, CM Revanth reddy

By
en-us Political News

  
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..!
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..!
కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..
“హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.