ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
Publish Date:Apr 17, 2026
Advertisement
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, చిత్రాలను అనధికారికంగా వాణిజ్య ప్రకటనల్లో వినియోగిస్తున్నారని పేర్కొంటూ, తన అనుమతి లేకుండా పలు సంస్థలు ప్రకటనల కోసం తన ఇమేజ్‌ను ఉపయోగిస్తున్నాయని, వెంటనే ఆ చర్యలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అల్లు అర్జున్ తరఫున న్యాయవాది స్వాతి సుకుమారన్ వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు, ఫోటోలు అనధికారంగా ఉపయోగించబడుతున్నాయన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి అల్లు అర్జున్ మాట్లాడుతున్నట్లు గా కనిపించే వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయని న్యాయవాది స్వాతి సుకుమారన్ వాదించారు. ఈ చర్యలు అభిమానులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని, అలాగే ప్రముఖుడి వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొంటూ వెంటనే వాటిపై నిషేధం విధించాలని కోర్టును అభ్యర్థించారు.
http://www.teluguone.com/news/content/actor-allu-arjun-petition-in-delhi-court-36-217585.html





