ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ..!

Publish Date:Jul 19, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 840 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. సుమారు రూ.30 వేల కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తుతో రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ చర్యలతో ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలు, తప్పుడు సర్వే నంబర్ల ఆధారంగా కాజేయాలని ప్రయత్నిస్తున్న వారికి హైడ్రా గట్టి హెచ్చరిక పంపింది.

ఈ ఆపరేషన్‌లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 25, 26లో ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమి, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం లోని సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్‌ఆర్ నంబర్లు 243, 255లో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. రాయదుర్గంలో ఎకరాల కొద్దీ ఆక్రమణలకు అడ్డుకట్ట ఐటీ కారిడార్‌లో టి-హబ్‌కు సమీపంలో ఉన్న రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా ఉన్న కొండలు, పచ్చని చెట్లతో కూడిన ప్రభుత్వ భూమిపై కొందరు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయి. 

ప్రైవేట్ పట్టాకు చెందిన అర ఎకరం భూమిని కొనుగోలు చేసిన తర్వాత, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు చూపిస్తూ సర్వే నంబర్ 46లోని ప్రభుత్వ భూమి లోకి చొరబడి దాదాపు ఎకరం వరకు ఆక్రమిం చినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.200 కోట్ల వరకు పలుకుతుండటంతో భారీ స్థాయిలో ఆక్రమణలకు ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా పూర్తిస్థాయి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది.

కంటోన్మెంట్‌లో 106 ఎకరాల భూమి రక్షణ...!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్‌ఆర్ నంబర్లు 243, 255లో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు కొందరు నిర్మాణ సంస్థలు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వేరే సర్వే నంబర్ల పేరుతో లేఔట్లు వేసి ప్లాట్లుగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడైంది. కొండలను పేల్చడం, చెట్లను తొలగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు నెమళ్లు వంటి వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రీకాస్ట్ గోడలను తొలగించి మొత్తం 106 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ చర్యను స్వాగతిస్తూ స్థానికులు ర్యాలీలు నిర్వహించి, టపాసులు పేల్చి హైడ్రాకు మద్దతు ప్రకటించారు.

శంషాబాద్‌లో 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం...!

రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణ భాగంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ భూములను కూడా తమవిగా చూపించే ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26లోని 650 ఎకరాలు ప్రభుత్వ భూములేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2002 నుంచి 2006 మధ్య నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వేలో కూడా ఇదే విషయం తేలగా, ఆక్రమణలను క్రమబద్ధీకరించాలన్న ప్రతిపాదనను 2006లో సీసీఎల్‌ఏ తిరస్కరించింది. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఈ భూములను కేటాయించరాదని ప్రభుత్వం అప్పుడే నిర్ణయించింది. అయినప్పటికీ కొందరు రైతులు, ఫామ్‌హౌస్ యజమానులు ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తూ కొనసాగుతున్నట్లు గుర్తించిన అధికారులు వారిని ఖాళీ చేయించి మొత్తం 650 ఎకరాల భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు...!

ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా ఇకపై కూడా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలు, తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.  

By
en-us Political News

  
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.