Publish Date:Apr 17, 2026
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేం దుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
కుటుంబ సభ్యులతో కలిసి యూరప్, యూకే పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 15 వరకు మొత్తం 25 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే.. ఇందుకు పలు షరతులు విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తన కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీతో పాటు అవసరమైన ష్యూరిటీ వివరాలను సిబిఐ అధికారులకు సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.
అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, దేశం విడిచి వెళ్లాలంటే తప్పనిసరిగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతి కోసం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-court-approves-jagan-foreign-tour-36-217577.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.