బెయిల్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఎస్సై

Publish Date:Jun 23, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే అదే చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించి చివరకు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వి. నరసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఆ కేసు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానంటూ ఎస్సై నరసింహులు ఫిర్యాదిదారుడి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అంత మొత్తం ఇవ్వలేనని ఫిర్యాదిదారుడు చెప్పడంతో ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి. చివరకు తొలి విడతగా రూ.50 వేల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది.

అయితే ఎస్సై అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న ఫిర్యాదిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, మంగళవారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లోనే డబ్బులు అందజేసేలా ఏర్పాట్లు చేశారు.

ఫిర్యాదిదారుడి నుంచి ఎస్సై నరసింహులు రూ.50 వేల లంచం తీసుకుంటుండగానే హైదరాబాద్ సిటీ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఆయన సూచించిన ప్రదేశం నుంచి కలుషితమైన రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుంది.

తర్వాత గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లోని ఎస్సై కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించి సంబంధిత పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. విధి నిర్వహణలో నిజాయితీ పాటించాల్సిన బాధ్యతను విస్మరించి, అక్రమ ప్రయోజనం కోసం లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఎస్సై నరసింహులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 94404 46106 వాట్సాప్ నంబర్ ద్వారా లేదా ఏసీబీ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.