Publish Date:Jan 25, 2022
డబ్బెక్కడ దాచుకుంటావని అడిగితే.. ఇంకెక్కడ బ్యాంకులో.. అనేది కామన్ ఆన్సర్. ఎందుకంటే, బ్యాంకులో డబ్బు సురక్షితం అనేది అందరి అభిప్రాయం. క్యాష్ విత్‌డ్రాలకు లిమిట్ పెట్టడం.. ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్జాక్షన్సే అవడంతో.. ఇష్టం ఉన్నా లేకపోయినా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు ఉంచుకోవాల్సిన పరిస్థితి. అందుకే, బ్యాంకుల్లో భారీ నగదు నిల్వ ఉంటోంది. అది క్యాష్ రూపంలో కాకుండా అక్కడ కూడా ఆన్‌లైన్ మనీనే. అందుకే, మునుపటిలా బ్యాంకులకు కన్నెం వేయడం లాంటి చోరీలకు కాలం చెల్లింది. కష్టపడి బ్యాంక్ గోడలకు రంధ్రం చేయడం.. లాయర్లు పగలగొట్టడం లాంటివి పాతచింతకాయ పచ్చడి టైమ్ దొంగతనాలు. ఇప్పుడంతా ఆన్‌లైన్ దోపిడీనే. ఎక్కడో ఉంటారు.. ఇంకెక్కడి మనీనో కొట్టేస్తారు. జస్ట్ కంప్యూటర్ క్లిక్స్‌తో సర్వం దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో అలానే నిమిషాల వ్యవధిలోనే 12 కోట్లు దోచేశారు సైబర్ నేరగాళ్లు. అది కూడా హాలిడేస్ టైమ్‌లో.
హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లే చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసి, బ్యాంకు మూలధన ఖాతా నుంచి ఏకంగా రూ.12.40 కోట్లు దోచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఇతర బ్యాంకుల్లో ఉన్న తమ 120 ఖాతాలకు ఆ సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేశారు. బ్యాంకుకు సెలవు రోజులైన శని, ఆదివారాలను ఈ హ్యాకింగ్‌కు అవకాశంగా వాడుకున్నారు కేటుగాళ్లు.
రెండు రోజులు సెలవుల తర్వాత సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకుకు వచ్చి పని మొదలుపెట్టబోగా.. సర్వర్ పని చేయడం లేదని గుర్తించారు. బ్యాంకు ఉన్నతాధికారులు వెంటనే సాంకేతిక సిబ్బందిని అలర్ట్ చేశారు. వారు రంగంలోకి దిగి పరిశీలించగా బ్యాంకు మెయిన్ సర్వర్ హ్యాక్ అయినట్లు తేలింది. సాంకేతిక నిపుణులు నిమిషాల వ్యవధిలో బ్యాంకు మెయిన్ సర్వర్ సాఫ్ట్‌వేర్‌ను సెక్యూర్డ్ చేసినప్పటికీ, అప్పటికే బ్యాంకు మూలధన ఖాతా నుంచి రూ.12.40 కోట్ల డబ్బు గల్లంతైనట్లు తేలింది. సిటీ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు.
నేరగాళ్లు చాలా పక్కాగా సైబర్ క్రైంకు పాల్పడ్డారు. బ్యాంకులో రోజు వారీగా రూ.5 కోట్లకు మించి మూలధన ఖాతా నుంచి విత్‌డ్రా చేయడానికి వీల్లేకుండా సాఫ్ట్‌వేర్ ఉంది. ఈ విషయం పసిగట్టిన హ్యాకర్లు.. బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేయగానే.. ముందుగా 5 కోట్ల లిమిట్‌కి ఇంకో సున్నా యాడ్ చేసి.. పరిమితిని 50 కోట్లకు పెంచేశారు. ఆ వెంటనే రూ.12.40 కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 120 ఖాతాల్లోకి మళ్లించారు. అవన్నీ వాళ్లు ముందే రెడీ చేసి పెట్టుకున్న బ్యాంక్ అకౌంట్లు. ఈ ఘరానా దోపిడీపై సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఘటనపై బ్యాంక్ ఎండీ ఉమేశ్ చంద్ అసావా స్పందించారు. డబ్బులు మళ్లించిన లావాదేవీలను గుర్తించామని.. ఆయా ఖాతాలను బ్లాక్ చేయించే ప్రయత్నం చేశామని చెప్పారు. 4 రాష్ట్రాల్లో, 45 శాఖలున్న మహేశ్ బ్యాంకు కస్టమర్లందరి డబ్బు సురక్షితంగా ఉందని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/12-crore-cyber-crime-in-mahesh-bank-39-130710.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.