Publish Date:Jan 25, 2022
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు వచ్చాయంటే మన ప్రభుత్వాల దృష్టి అంతా భద్రత మీదనే కేంద్రీకృతమవుతుంది. పోయినసారి రైతుల రూపంలో తీవ్రమైన నిరసనలు, విపరీతమైన టెన్షన్స్ వెల్లువెత్తాయి. ఈసారి అలాంటివేం లేకపోయినా పతాకావిష్కరణ టైమ్ మాత్రం మారింది. ఉత్తరాదిన పొగ మంచు కమ్మేసి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అటు కరోనా థర్డ్ వేవ్ (ఒమిక్రాన్ కేసులు) ప్రభావం పెరుగుతోంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి జెండావిష్కరణ టైమ్ ను అరగంట పాటు వెనక్కి జరిపారు. ఉదయం 10 గంటలకు జరగాల్సిన పతాకావిష్కరణను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 10.30 కు నిర్వహిస్తారని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని, రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించడం సంప్రదాయం.
అటు ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ భారీ నిఘా పెట్టారు. గణతంత్ర వేడుకులకు ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌తో కూడిన సీసీ కెమెరాలు వాడుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర‌్ ద్వారా.. కనిపిస్తున్న వ్యక్తులు ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. ఢిల్లీలోని 30 సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటి సీసీ కెమెరాలు వాడుతున్నారు. ఈ వేడుకల సందర్భంగా 65 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సహా 27 వేల మంది పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఈసారి ప్రత్యేక గెస్టుల్లోనూ ప్రత్యేకతే..
గతేడాది లాగే ఈసారి కూడా గణతంత్ర వేడుకలకు ప్రత్యేకమైన విదేశీ అతిథి ఎవరినీ ఆహ్వానించలేదు. పోయినసారి కరోనా మహమ్మారి సెకండ్ వేవ్, ఈసారి థర్డ్ వేవ్ గణతంత్ర వేడుకలను మినిమైజ్ చేసిందనే చెప్పాలి. అయినా ప్రత్యేకంగా నిర్వహించడంలో తగ్గేదే లేదంటున్నారు కేంద్ర సర్కారు పెద్దలు. రిపబ్లిక్ డే పేరడ్స్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆటో డ్రైవర్లు, కన్స్ ట్రక్షన్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బందినీ ఆహ్వానించారు. దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flag-hoisting-time-changed-39-130705.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.