Publish Date:Jul 16, 2026
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను చేసే ప్రతి పర్యటనలోనూ.. క్కడ అడుగుపెట్టినా బలప్రదర్శన చేయాలన్న ఆత్రం తప్ప.. తాను ఎందుకు పర్యటన చేస్తున్నారు అన్న ధ్యాస కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆయన బుధవారం (జులై 15) భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి. దీంతో ఆశించిన సానుకూలతకు బదులుగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా బుధవారం (జులై 15)పర్యటనల్లోనూ అదే జరిగింది.
ముందుగా ఆయన భీమవరంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి రవాణా సమస్యలతో బాధపడుతున్న స్థానిక ఆక్వా రైతులకు మద్దతుగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అయితే ఆయన భీమవరం పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్వయంగా జగనే దాని వల్ల ఇబ్బందులు పడ్డారు. సొంత మద్దతు దారులే ముందుకు తోసుకుని రావడంతో ఆయన వేదికపై బొక్కబోర్లా పడినంతపనైంది. భీమవరం సభకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై జగన్ చుట్టూ చేరిన అభిమానులు ఆయనను తాకేందుకు, ఆయన దృష్టిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి.
స్వయంగా తన మద్దతు దారుల తోపులాట కారణంగానే జగన్ వేదికపై అదుపు తప్పి బోర్లా పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు కనుక సరిపోయింది కానీ.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పరిశీలకులు అంటున్నారు.
సరే బలప్రదర్శన కారణంగా భీమవరంలో జరిగిన నిర్వాకం చాలదన్నట్లుగా దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా జగన్ భారీ ర్యాలీతో వెళ్లారు. జగ్గయ్య పేట నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకున్న జగన్ పర్యటన అంత్యక్రియలకు వెడుతున్నట్లుగా కాకుండా ఏదో యుద్ధానికి వెడుతున్నారా అన్నట్లుగా భారీ ర్యాలీగా సాగింది. మరణించిన నేతకు నిశ్శబ్దంగా నివాళు లర్పించాల్సిన సమయంలో ఇలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేదిక వద్ద జగన్ రాకతో హడావుడి, గందరగోళం నెలకొన్నాయి సీనియర్ నేత చివరి వీడ్కోలు కార్యక్రమం కాస్తా, రాజకీయ బలప్రదర్శనగా ప్రదర్శనగా మారిందని ముద్రగడ అభిమానులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.
YS Jagan Mohan Reddys tour, Bhimavaram aqua farmers protest, Mudragada Padmanabham's funeral, YSRCP turmoil
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagans-attempts-to-demonstrate-strength-backfiring-39-226181.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.