పీవోకేలో పాక్ బలగాల మారణ కాండ.!

Publish Date:Jul 29, 2026

Advertisement

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో  రక్తం ఏరులై పారుతోంది. ప్రాథమిక హక్కుల కోసం, రాజకీయ అధికారంలో ప్రాంతీయ భాగస్వామ్యం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరాయుధ ప్రజలపై పాకిస్థాన్ బలగాలు తుపాకులతో విరుచుకుపడుతున్నాయి. పాక్ బలగాల కాల్పులలో రెండు రోజుల వ్యవధిలోనే 40 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. 

హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు.  గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో   40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం   ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది. పాక్ రక్షణ మంత్రి పీవోకేలో ఆందోళనలు చేస్తున్న వారు పాక్ కు శత్రువులు అని ప్రకటించి.. ఆ ఆందోళనల అణచివేతకు సైన్యాన్ని ప్రయోగించారు. పాక్ బలగాల దాడులు, కాల్పులతో పీవోకే రక్తమోడుతోంది.   

పీవోకేలో పాక్ బలగాల దమన కాండను  యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ  తీవ్రంగా ఖండించింది.   గత నెల 5 నుంచి ఈ నెల 28 వరకూ పీవోకేలో పాక్ బలగాల దమనకాండకు తక్కువలో తక్కువ వంది మంది మరణించారు. పాక్ బలగాల పైశాచికత్వాన్ని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఖండించింది. ఇది నిరాయుధులపై పాక్ ప్రభుత్వం చేస్తున్న యుద్ధమని విమర్శించింది.  హక్కులను కోరడమే పీవోకే  ప్రజలు చేసిన నేరమా అని ప్రశ్నించింది. పాక్ ప్రభుత్వం తన సొంత పౌరులపైనే  సైనిక చర్యలకు పాల్పడుతోందని, ఇది మానవత్వానికే   మచ్చ అని మండి పడింది. 

ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్, మీర్పూర్ సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులు  ఉద్రిక్తంగా మారాయి. వాస్తవాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు, వార్తలు అంతర్జాతీయ మీడియాకు చేరకుండా చేసేందుకు పాక్ ప్రభుత్వం అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిగా నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ కావడం వల్ల అక్కడి ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

PoK violence, Pakistan army firing, Rawalakot curfew,  United Kashmir Peoples National Party, PoK crisis

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.