డిజిటల్ అరెస్ట్ కేటుగాళ్లకు నో బెయిల్.. సుప్రీం ఆదేశాలు.!
Publish Date:Jul 29, 2026
Advertisement
దేశవ్యాప్తంగా అందరినీ భయాందోళనలకు గురిచేస్తూ, లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. సైబర్ కేటుగాళ్లు పన్నుతున్న ఈ డిజిటల్ పద్మవ్యూహం కేవలం ఒక సాధారణ మోసం కాదని పేర్కొంది. డిజిటల్ అరెస్టును పట్టపగలు జరిగే బందిపోటు దోపిడీతో సమానమని అభివర్ణించింది. ఇలాంటి డిజిటల్ దోపిడీల్లో భాగమైన నిందితులకు అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మినహా ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని ట్రయల్ కోర్టులతో పాటు రాష్ట్రాల హైకోర్టులకు కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు, ప్రధాన సైబర్ క్రిమినల్ కోసం కేవలం బ్యాంక్ ఖాతాను తెరిచి సహకరించానని, అంతకు మించి తనకు ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదా కుట్ర లేదని పేర్కొంటూ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆ బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చింది. సైబర్ మోసగాళ్లకు ఖాతాలు సమకూర్చడం, డబ్బు మళ్లించడానికి మార్గం సుగమం చేయడం కూడా దోపిడీలో భాగస్వామిగా ఉండటమేనని విస్పష్టంగా పేర్కొంది. Supreme Court on Digital Arrest, No Bail for Cyber Criminals, Organised Crime Control Act, Cyber Crime India, Supreme Court News
http://www.teluguone.com/news/content/-no-bail-to-digital-arrest-fraudters-36-227423.html





