తిరుపతిలో కలుషిత ఆహారం కలకలం.!
Publish Date:Jul 30, 2026
Advertisement
ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కుళ్లిన ఆహార పదార్థాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది! బైరాగి పట్టెడ ప్రాంతంలోని జగత్ జీవన్ రావు పార్క్ వద్ద ఉన్న ఒక బిర్యానీ ఫ్యాక్టరీ కమ్ హోటల్, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ, నిల్వ ఉంచిన, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న బిర్యానీని యథేచ్ఛగా వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు బయటపడింది. ఆ కలుషిత బిర్యానీ తిని ఓ మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఆ ఘోటల్ నిర్వాకం బయట పడింది. పాప ఆస్వస్థతకు గురి కావడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆ హోటల్ వద్దకు చేరుకుని భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ హోటల్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై భైఠాయించారు. తిరుపతిలాంటి ఆధ్యాత్మిక నగరంలో కలుషిత ఆహారం విక్రయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఆహార భద్రత అధికారులు వెంటనే స్పందించి, ఇలాంటి కల్తీ ఆహారం విక్రయించే హోటళ్లపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Rotten Food Tirupati, Bairagi Patteda Biryani, Tirupati Biryani Hotel, Food Poisoning Tirupati, Telugu ONE
http://www.teluguone.com/news/content/contaminated-food-causes-a-stir-in-tirumala-36-227515.html





