ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్ ప్రొఫెసర్ మృతి.!
Publish Date:Jul 30, 2026
Advertisement
దేశంలోనే ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో ఓ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. 36 ఏళ్ల యువ శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. దీపక్ రెడ్డి స్వస్థలం హైదరాబాద్. విద్యా రంగాన్ని, విద్యార్థి లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతుడైన యువ ప్రొఫెసర్, అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. క్యాంపస్‌లోని బి-టైప్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ప్రొఫెసర్ దీపక్ రెడ్డి గురువారం (జులై 29) మధ్యాహ్నం వరకూ కూడా తన నివాసం నుంచి బయటకు రాకపోవడంతో తోటి సిబ్బందికి, పొరుగువారికి అనుమానం వచ్చింది. తలుపులు బాది, గట్టిగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో, క్యాంపస్ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపల ప్రొఫెసర్ దీపక్ రెడ్డి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రొఫెసర్ దీపక్ రెడ్డి మృతి పట్ల ఖరగ్ పూర్ ఐఐటీ యాజమాన్యం తీవ్ర సంతాపం ప్రకటించింది. IIT Kharagpur, Deepak Reddy Pullaguram, Hyderabad professor death, IIT Kharagpur suicide
http://www.teluguone.com/news/content/hyderabad-professor-dies-under-suspicious-circumstances-at-iit-kharagpur-36-227518.html





