నా తండ్రి నుంచే నాకు ప్రాణహాని ఉంది.. ఎమ్మెల్యే కొడుకు సంచలన వ్యాఖ్యలు ..!
Publish Date:Aug 6, 2026
Advertisement
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తన సొంత తండ్రి అయిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నుంచే తనకు, తాను ప్రేమించిన యువతికి తీవ్ర ప్రాణహాని ఉందంటూ సంతోష్ గౌడ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పక్క ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను తీర్చాల్సిన రాజకీయ నాయకుడి ఇంట్లోనే ఇలాంటి తీవ్రస్థాయి కుటుంబ కలహాలు, ప్రాణ బెదిరింపులు వెలుగుచూడటం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకోవడమే తాను చేసిన నేరమా అని సంతోష్ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏ క్షణంలోనైనా తనను, తనకు కాబోయే భార్య కుటుంబాన్ని చంపే ప్రమాదం ఉందంటూ పోలీసులను, ప్రభుత్వాన్ని రక్షణ కల్పించాలని బహిరంగంగా ఆర్థించాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, సంతోష్ గౌడ్ శ్రీయాషి అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో తొలత కొన్ని చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే 2026 జులై 8వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో సంతోష్, శ్రీయాషిల నిశ్చితార్థం కూడా ఎంతో వైభవంగా జరిగింది. కన్న తల్లిదండ్రులు స్వయంగా ముందుండి ప్రేమ వివాహం జరిపించడానికి నిరాకరించినప్పటికీ, కుమారుడి ఇష్టాన్ని గౌరవిస్తూ వివాహానికి స్పష్టమైన అనుమతి ఇచ్చారని సంతోష్ తెలిపాడు. ఈ నిశ్చితార్థం ముగిసిన తర్వాత గత 1 నెల రోజులుగా తాను కాబోయే భార్య ఇంట్లోనే నివాసముంటున్నానని, ఈ విషయం తన తండ్రి ప్రకాశ్ గౌడ్‌తో సహా కుటుంబ సభ్యులందరికీ పూర్తిగా తెలుసని అతడు మీడియాకు వెల్లడించాడు.అయితే ఊహించని రీతిలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. తమ వివాహాన్ని ససేమిరా ఒప్పుకోని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, తన అనుచరులతో దాడులకు పూనుకున్నట్లు సంతోష్ తీవ్రమైన విమర్శలు చేశాడు. సుమారు 40 మంది గుండాలు, అనుచరులు అకస్మాత్తుగా వచ్చి తాను ఉంటున్న కాబోయే అత్తగారి ఇంటిపై విచక్షణారహితంగా దాడి చేశారని సంతోష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇంట్లోని మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటమే కాకుండా, అసత్య ప్రచారాలు చేస్తూ ఎవరో అప్పులివ్వాలంటూ తప్పుడు పిటిషన్లు ఇప్పించి మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఈ అకృత్యాలకు, దాడులకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలు, వీడియో రికార్డింగ్‌లు కూడా తమ వద్ద భద్రంగా ఉన్నాయని అతడు స్పష్టం చేశాడు. ప్రజాప్రతినిధిగా ఉంటూ సొంత కొడుకుపైనే గుండాలతో దాడి చేయించడం ఎంతవరకు న్యాయమని సంతోష్ గౌడ్ తీవ్రంగా ప్రశ్నించాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్లే తమను అంతమొందించేందుకు ఈ కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నామని, తనకు మరియు తన కాబోయే భార్య శ్రీయాషి కుటుంబానికి తక్షణమే తగిన పోలీస్ రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్నాడు. ఈ సంచలన ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనంగా మారి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. MLA Prakash Goud, Prakash Goud son Santhosh Goud, Congress MLA Prakash Goud news, Telangana politics news, Prakash Goud son love marriage, Hyderabad crime and politics
http://www.teluguone.com/news/content/-mla-prakash-goud-36-228207.html





