200 కార్ల భారీ కాన్వాయ్‌తో కొడంగల్‌కు కల్వకుంట్ల కవిత..!

Publish Date:Sep 20, 2026

Advertisement

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కోస్గిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి ఆమె భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. సుమారు 200 కార్లతో భారీ కాన్వాయ్ కొనసాగుతోంది. హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ వద్ద కవితకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని కవితకు స్వాగతం పలికారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. 

సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సభలో తెలంగాణ రక్షణ సేన భవిష్యత్ కార్యాచరణ, పార్టీ విధానాలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై కవిత తన రాజకీయ దిశను వివరించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించాలని కవిత గతంలో ప్రకటించారు. ఈ సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును ఆమోదించిన తర్వాత కవిత చేపడుతున్న రాజకీయ కార్యక్రమాల్లో కొడంగల్ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే నిజామాబాద్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన, తదుపరి దశలో కొడంగల్‌–కోస్గి కేంద్రంగా పార్టీ కార్యకలా పాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అనంతరం అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా మరో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో పార్టీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోస్గి సభకు భారీగా పార్టీ శ్రేణులు తరలివస్తుండటంతో కొడంగల్‌లో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

 

 

[ Kalvakuntla Kavitha to Kodangal, TRS, Telangana Rakshana Sena, Kosgi, CM Revanth reddy, KCR, KTR,BRS Party, Telugu One, Telugu News, Panchajanya Sankalpa Sabha, Indravelli ] 

By
en-us Political News

  
లేడీ గెటప్‌లో వచ్చి.. సీసీటీవీలపై స్ప్రేల దాడి..!
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే చప్పుళ్లకు వరుస గుండెపోటు మరణాలు..!
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాద ఛాయలను నింపింది.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది.
మర్డర్ కేసులో వైష్ణవి సోదరుడితో పాటు మరో ముగ్గురి పాత్ర..!
మగపిల్లలకు పెళ్లి ముచ్చట లేదు.. టార్గెట్లు ఎలా పూర్తి చేయాలి.. ఆశా వర్కర్ల ఆవేదన..?
సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజాన్ ఉద్దీన్ మృతి చెందాడు.
రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు  ఆమెకు   జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్‌లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 స్టేషన్‌ బయట సదరు కానిస్టేబుల్‌ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.