హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్
Publish Date:Jan 9, 2026
Advertisement
టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. ఆయనపై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ వద్ద డ్రగ్స్ దొరకలేదని న్యాయవాది సిద్ధార్థ్ వాదించారు. నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో కేసు ఉంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. గుడిమల్కాపూర్‌లో నమోదైన కేసులో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నవదీప్ పేరు పెట్టారని హై కోర్టు పేర్కొన్నాది.
http://www.teluguone.com/news/content/-hero-navdeeps-drugs-case-36-212280.html





