తొలి వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే?
Publish Date:Jan 11, 2026
Advertisement
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు కాన్వే (56), నికోల్స్ (62) రన్స్ చేశారు. డారిల్ మిచెల్ (84) అద్భుత ఇన్నింగ్స్ అందించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించినా, బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీశారు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత హెన్రీ నికోల్స్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా, కాసేపటికే కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.
http://www.teluguone.com/news/content/daryl-mitchell-36-212384.html




