మహిళా టెకీకి సెక్యూరిటీ గార్డు ముద్దు: గచ్చిబౌలిలో దారుణం..!
Publish Date:Sep 23, 2026
Advertisement
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా భద్రతకు సంబంధించి తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ఇందిరానగర్ ప్రాంతంలో ఉదయం విధులకు వెళ్లేందుకు సిద్ధమైన 24 ఏళ్ల యువతి, మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో క్యాబ్ కోసం వేచి చూస్తూ, క్యాబ్ ఎక్కుతున్న సమయంలో రోడ్డుపై ఎవరూ లేని సమయం చూసి ఒక సెక్యూరిటీ గార్డు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఎలాంటి భయం లేకుండా ఆ మహిళా టెకీని బలవంతంగా పక్కకు లాగి, అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఊహించని పరిణామానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు ప్రాణభయంతో బిగ్గరగా కేకలు వేసింది. ఆమె ఒక్కసారిగా ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆందోళన చెင်దిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాధితు వెంటనే తేరుకుని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు అందజేసింది. మహిళలపై అరాచకాలను అణచివేయడంలో ఎప్పుడూ ముందుండే గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సంఘటన స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. టెక్నాలజీ సాయంతో దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలించారు. విచారణలో భాగంగా పరారైన నిందితుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతడి కదలికలను ట్రాక్ చేసి వేగంగా అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐటీ హబ్‌లో మహిళా టెకీలకు రక్షణ కల్పించాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం స్థానికంగా మరియు ఐటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. వర్కింగ్ ఉమెన్ భద్రతపై మరోసారి తీవ్రమైన చర్చ జరిగేలా చేసిన ఈ ఘటనలో పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని పట్టుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. [ Gachibowli crime, Female techie molested, Hyderabad news, Security guard Arrested, working women safety, Gachibowli police, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police ]
http://www.teluguone.com/news/content/-gachibowli-crime-24-232234.html





