వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అరెస్ట్..!

Publish Date:Sep 22, 2026

Advertisement

ఎంజీఎం ఆస్పత్రి వద్ద రణరంగం.. రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే..!

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదకర సంఘటనలు, ముఖ్యంగా భవనాల పైకప్పు పెచ్చులూడిపడుతున్న దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. 

ఈ తోపులాటలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాలు, చేతికి బలమైన గాయాలై రక్తస్రావం జరిగినట్లు ఆయన వర్గీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాడే ఎంజీఎంలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు, వారి అటెండర్లు గాయపడిన ఘటన ఇంకా ముగియకముందే, మంగళవారం ఏకంగా ఆర్‌ఐసీయూ (RICU) వార్డులో మరోసారి పైకప్పు పెచ్చులు కుప్పకూలడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఆస్పత్రిలో జరుగుతున్న ఈ వైఫల్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి, రోగుల భద్రతను సమీక్షించేందుకు వినయ్ భాస్కర్ హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు.

అయితే, ఆయనను ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. పోలీసుల చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసుల వలయాన్ని, ఆంక్షలను ధిక్కరించి, నిర్బంధాలను ఛేదించిన వినయ్ భాస్కర్ ఎలాగోలా ఆస్పత్రి ప్రాంగణంలోకి దూసుకెళ్లి క్షష్ట పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై గొంతు ఎత్తే వారిని, ప్రశ్నించే వారిని అణచివేయడమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలనగా మారిందని మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో పేద ప్రజలకు కనీస వైద్యం అందక పోవడానికి తోడు, సరైన బెడ్లు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తరచూ ఆస్పత్రి భవనాల పైకప్పులు కూలిపోవడం, అంబులెన్స్‌ల తీవ్ర కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సమస్యలను పరిశీలించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతను ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. ఆస్పత్రి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన యంత్రాంగం, నిలదీసే వారిని అణచివేయాలని చూస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

 

 

[ Vinay Bhaskar, MGM Hospital Warangal, BRS protest, Warangal news today, roof collapse hospital, Telangana political news, Congress party   ]

By
en-us Political News

  
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం   6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. కొంతమంది అధికారులు మాత్రం తళుకు బెళుకు లేకుండా రహస్యంగా లంచం
పట్టణ ప్రజలకు అత్యుత్తమ పౌర సేవలను అందించడంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం  ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన..   నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం  వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని వివరించారు.
 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలపై ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి, వాటిని  రికార్డు చేస్తున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
గత రెండు దశాబ్దాలుగా నిమ్స్ ఆసుపత్రిలో వివిధ హోదాల్లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భాగ్యనగరంలో శాంతిభద్రతలపై నగర ప్రజల ఆందోళన..!
కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను ఎవరో వదిలిన బాణంగా అభివర్ణిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న కవిత.. తాను ఎవరికోసమో పనిచేసే వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టారు.
అగ్నిప్రమాదంలో  ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు..  అదే వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.  
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కల సాకార దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి..!
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.