రేవంత్ సర్కార్ అరాచకాలపై బీఆర్ఎస్ పింక్ బుక్.!

Publish Date:Sep 22, 2026

Advertisement

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శల దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నాయకులు,  పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, సాగిస్తున్న అణచివేత ధోరణిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్..  పింక్‌ బుక్‌ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం మారిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ప్రతీకార చర్యలు, అక్రమ కేసులు, వేధింపులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ పింక్ బుక్ లో లిఖితపూర్వకంగా నమోదు చేసేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. 

 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలపై ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి, వాటిని  రికార్డు చేస్తున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బాధితులు ఇస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం పోలీసు అధికారుల తీరుపైనే ఉండటం గమనార్హం. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడుతున్న అధికారులకు బీఆర్ఎస్  హెచ్చరిస్తూ.. తాము తిరిగి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత,  చట్టాన్ని అతిక్రమించి తమ నాయకులను టార్గెట్ చేసిన ఏ   అధికారినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తోంది.   పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా అప్పటి జగన్ ప్రభుత్వ అరాచకాలు, వేధింపులు, కక్ష సాధింపులను నారా లోకేష్ రెడ్‌ బుక్‌ లో రికార్డ్ చేసిన చందంగానే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పింక్ బుక్ ను తెరపైకి తెచ్చింది.  

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తి దృష్టి పెట్టామని, ప్రతికార రాజకీయాలకు ఎప్పుడూ తావు ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అయితే ప్రస్తుత రేవంత్ సర్కార్ మాత్రం  కక్షపూరిత ధోరణితో  వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరి లెక్కా రాస్తున్నామని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు.  


[BRS Pink Book, Telangana Politics, KTR, Revanth Reddy Government, BRS Action Plan, elangana News, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం   6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. కొంతమంది అధికారులు మాత్రం తళుకు బెళుకు లేకుండా రహస్యంగా లంచం
పట్టణ ప్రజలకు అత్యుత్తమ పౌర సేవలను అందించడంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం  ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన..   నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం  వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని వివరించారు.
ఎంజీఎం ఆస్పత్రి వద్ద రణరంగం.. రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే..!
గత రెండు దశాబ్దాలుగా నిమ్స్ ఆసుపత్రిలో వివిధ హోదాల్లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భాగ్యనగరంలో శాంతిభద్రతలపై నగర ప్రజల ఆందోళన..!
కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను ఎవరో వదిలిన బాణంగా అభివర్ణిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న కవిత.. తాను ఎవరికోసమో పనిచేసే వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టారు.
అగ్నిప్రమాదంలో  ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు..  అదే వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.  
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కల సాకార దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి..!
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.