ACBకి చిక్కిన అధికారి: 80 వేల లంచం.!

Publish Date:Sep 22, 2026

Advertisement

ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. కొంతమంది అధికారులు మాత్రం తళుకు బెళుకు లేకుండా రహస్యంగా లంచం డిమాండ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా మరో అధికారి ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పెద్దపేట జీపీలో గ్రామ పరిపాలన అధికారిగా దుర్గాప్రసాద్ పనిచేస్తున్నాడు. ఓ బాధితుడు తన పేరు మీద భూమిని ధ్రువీకరించడంతో పాటు పట్టా పాస్‌బుక్‌ల జారీకి సంబంధించి దుర్గాప్రసాద్‌ను కలిశాడు. అయితే ఇందుకు రూ.1,30,000 లంచంగా ఇవ్వాలని దుర్గాప్రసాద్ డిమాండ్ చేశాడు. 

అంత పెద్ద మొత్తంలో తాను ఇవ్వలేనని బాధితుడు మొరపెట్టుకున్నా.. దుర్గాప్రసాద్ పట్టించుకోలేదు. పని పూర్తి కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెప్పాడు. దీంతో మొదటగా రూ.80,000 చెల్లించాలని, పని పూర్తయిన తర్వాత మరో రూ.50,000 ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం‌చాడు. బాధితుడి ఫిర్యాదుతో పక్కా ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.పెద్దపేట శివార్లలోని వ్యవసాయ పొలాల సమీపంలో నిందితుడు దుర్గాప్రసాద్ మరో వ్యక్తితో కలిసి అక్కడికి వచ్చాడు. బాధితుడు దుర్గాప్రసాద్‌కు రూ.80,000 అందించగా.. ఆ డబ్బులను మరో వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు.

దుర్గాప్రసాద్ సూచన మేరకు బాధితుడు మరో వ్యక్తికి డబ్బులు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తనను పట్టుకోకుండా ఉండేందుకు దుర్గాప్రసాద్ పక్కా ప్లాన్ ప్రకారం డబ్బులను తన చేతితో తీసుకోకుండా మరో వ్యక్తి ద్వారా స్వీకరించాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు దుర్గాప్రసాద్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ కరీంనగర్‌లోని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

 

 

 

 

[ ACB, Anti Corruption Bureau, Bribe, ₹80 Thousand Bribe, Village Administrative Officer, VAO, ACB Raid, Bribery Case, Manchryala District, Bhimini Mandal,  Peddapeta GP, Durga Prasad, CM Revanth reddy ]

By
en-us Political News

  
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం   6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
పట్టణ ప్రజలకు అత్యుత్తమ పౌర సేవలను అందించడంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం  ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన..   నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం  వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని వివరించారు.
ఎంజీఎం ఆస్పత్రి వద్ద రణరంగం.. రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే..!
 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలపై ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి, వాటిని  రికార్డు చేస్తున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
గత రెండు దశాబ్దాలుగా నిమ్స్ ఆసుపత్రిలో వివిధ హోదాల్లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భాగ్యనగరంలో శాంతిభద్రతలపై నగర ప్రజల ఆందోళన..!
కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను ఎవరో వదిలిన బాణంగా అభివర్ణిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న కవిత.. తాను ఎవరికోసమో పనిచేసే వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టారు.
అగ్నిప్రమాదంలో  ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు..  అదే వార్డులో చికిత్స పొందుతున్న 28 మంది చిన్నారులను సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.  
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కల సాకార దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి..!
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.