స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.!

Publish Date:Aug 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  బీసీల రాజకీయ ప్రాతినిధ్యం 34 శాతం ఉండేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి సవిత  విస్పష్టంగా చెప్పారు.   అమరావతిలో  మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత , తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బీసీల రాజకీయ అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు.  చట్ట, రాజకీయ అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి  మాట నిలుపుకుంటామన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు మొట్టమొదటిసారిగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించినది ఎన్టీఆర్ హయాంలోనే అని గుర్తు చేసిన మంత్రి సవిత..   ఆ తర్వాత ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్ల పరిమితిని 34 శాతానికి పెంచారని వివరించారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే 34 శాతం రిజర్వేషన్ల ఆధారంగా విజయవంతంగా సాగాయన్న ఆమె.. అయితే జగన్ హయాంలో  బీసీలకు  అన్యాయం జరిగిందన్నారు.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి   24 శాతానికి కుదించిందని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల800 మంది బీసీ నాయకులు తమ పదవులు, రాజకీయ అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని గణాంకాలతో  వివరించారు.  

గత పాలనలోని అవినీతి మరియు అక్రమార్జన చర్యల వల్ల బీసీ నాయకులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో బీసీ నాయకులకు వివిధ రకాల పదవులు ఆశ చూపి, వారిని పావులుగా వాడుకున్నారని విమర్శించారు. అక్రమ మద్యం తయారీ, సరిహద్దుల దాటి మద్యం రవాణా, మరియు ఇసుక అక్రమ తవ్వకాలు వంటి అనేక కేసులలో బీసీ నేతలను ఇరికించారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ధన దాహానికి, అవినీతికి ప్రాతినిధ్యం వహించినందుకు బీసీ నేతలు ఈ రకమైన కేసుల్లో చిక్కుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు.

రాష్ట్రంలోని బీసీల భద్రత మరియు సమగ్ర వికాసం కోసం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి సవిత తెలిపారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించకుండా, వారి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే ప్రత్యేకంగా 'బీసీ రక్షణ చట్టం' తీసుకువస్తున్నామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా, వారి అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

 BC Reservations in AP local body elections,  34 Percent, Savitha Minister, AP Local Body Elections Reservations,  CBN  BC Welfare, AP Politics, TeluguOne 

By
en-us Political News

  
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు   110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో  వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావం  దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.