ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ విషయంలో వైసీపీ చేస్తున్న పోరాటానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయనీ, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలనీ కోరుతూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిల్ ను విచారించిన హైకోర్టు.. మెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారం లేదని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎలాంటి ఆధారాలు పిటిషన్ దాఖలు చేయడం సహేతుకం కాదని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాలు, లబ్ధి కోసం ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేస్తే, పిల్ అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం పేర్కొంది.
రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకోవడాన్ని ఉపేక్సించమని పేర్కొంటూ.. మెగా డీఎస్సీపై సిబిఐ విచారణ కోరుతూ పర్వత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. కోర్టు విస్పష్ట తీర్పుతో మెగా డీఎస్సీలో అక్రమాలు, నియమక ప్రక్రియలో అవకతవకలు అంటే వైసీపీ చేస్తున్న వాదనలో సరుకులేదని తేలిపోయింది. ఇక హైకోర్టు తీర్పుతో డీఎస్సీ నియామక ప్రక్రియ నిరాటంకంగా వేగంగాసాగనుంది. కోర్టు వివాదాల కారణంతో నియామకాలు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందిన నిరుద్యోగ యువత కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Mega DSC, AP High Court, YSRCP PIL Dismissed, Nara Lokesh, AP Teacher Recruitment 2026
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ap-mega-dsc-36-228051.html
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్‌ను, 70% మంది ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న కొత్త ఎఫ్‌డీ నిబంధనలు, వడ్డీ రేట్ల పారదర్శకత పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేసేలా పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన. కొత్త కార్లు, బైకుల బీమా గడువు పెంపుపై సమగ్ర కథనం.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.