విశాఖలో ఐబీఎం.. లోకేష్ విజయమేగా?

Publish Date:Aug 5, 2026

Advertisement

దిగ్గజ సంస్థ ఐబీఎం  విశాఖలో తన  కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఐబీఎం తిరిగి వైజాగ్‌లో అడుగుపెట్టడం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి   మైలురాయి అనడంలో సందేహం లేదు. ఐబీఎం పునరాగమనం గురించి రాష్ట్ర విద్యా, ఐటీ,  శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదికగా ఐబీఎంకు స్వాగతం పలికారు. 

విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్  భవనంలో ఐబీఎం  కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ఐ స్ప్రౌట్ భాగస్వామ్యంతో ఈ   సెంటర్ పని చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక బోర్డు,  ఆఫీస్ ప్రాంగణ ఫొటోలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. దీనికి  #ChooseSpeedChooseAP  అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత  చేశారు.  ఈ పోస్ట్  నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) పరిధిలో నమోదు చేసుకున్న ఐబీఎం సంస్థ, రాబోయే మూడేళ్ల కాలంలో   321 కోట్ల రూపాయల విలువైన సేవల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రాథమిక దశలోనే ఈ సెంటర్‌లో 500 మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. గ్లోబల్ డెలివరీ సెంటర్ ద్వారా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ కన్సల్టింగ్ సేవలను ఈ కేంద్రం నుండి అంతర్జాతీయ క్లయింట్లకు అందించనున్నారు.

గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో..  ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు. ఐటీ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి  విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సంప్రదింపులపై ప్రత్యేక దృష్టి సారించి,  గ్లోబల్ టెక్నాలజీ సదస్సులలో ఏపీ ప్రాధాన్యతను వివరిస్తూ, వేగవంతమైన అనుమతులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాల హామీతో టెక్ దిగ్జజ సంస్థల చూపు ఏపీవైపు మరల్చగలిగారు.  సానుకూల పారిశ్రామిక విధానాలు, పారదర్శక పాలన కారణంగానే గ్లోబల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు పునరాగమనం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదా విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల రాకతో స్థానిక యువతకు తమ సొంత ప్రాంతంలోనే అంతర్జాతీయ స్థాయి ఐటీ  కొలువులు లభించే వాతావరణం ఇప్పుడు ఏపీలో నెలకొందంటే అందుకు లోకేష్ చొరవ కారణమని అంటున్నారు.   

అదలా ఉంచితే.. ఐబీఎం విశాఖ పునరాగమనం మరో ఐటీ  ఇన్వెస్ట్ మెంట్ మాత్రమే కాదు.  ఈ పరిణామం..  వైసీపీ ఐదేళ్ల హయాంలో ఏం జరిగిందన్న విషయంపై మరో సారి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశ వ్యాప్తంగా చర్చకు తెరతీయడం. వైసీపీ హయాంలో  తన కార్యకలాపాలను మూసివేయడానికి ముందు ఐబిఎంకు విశాఖపట్నంలో కార్యాలయం ఉండేది. తాము ఎందుకు వెళ్లిపోయామో ఆ సంస్థ అధికారికంగా ఎప్పుడూ వివరించలేదు. కానీ.. విధానపరమైన అనిశ్చితి, పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలు, గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, నిర్ణయాల సమీక్ష  కారణంగానే  ఐబీఎం రాష్ట్రం నుంచి తరలిపోయిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. 

అంటే వైసీపీ నిర్వాకం వల్లే ఐబీఎం రాష్ట్రం నుంచి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ఒక్క ఐబీఎం మాత్రమే కాదు.. ఎన్నో సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. ఇందుకు కారణం వైసీపీ  ప్రభుత్వంపై ఇన్వెస్టర్ల  విశ్వాసం సన్నగిల్లడమేనన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు, ఐబిఎం తిరిగి వచ్చింది. ఆ సంస్థ విశాఖపట్నంలో ఒక క్లయింట్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.   రాబోయే మూడేళ్లలో  321 కోట్లకు పైగా విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుంది.  తొలి దశలో 500కు పైగా ఉద్యోగాలు కల్పించనుంది.  శాశ్వత క్యాంపస్ నిర్మించడానికి భూమి కోసం  అన్వేషిస్తోంది.   లోకేష్‌  ఐటీ మంత్రిగా శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ..   రాష్ట్రానికి ఐటీ కంపెనీలను ఆకర్షించడం పై ప్రత్యేక దృష్టి పెట్టి శ్రమించారు. ఆ శ్రమ, ఆ కృషి, ఆ పట్టుదల.. ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది.  

జగన్ హయాంలో  రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోవడం, లేదా తమ విస్తరణ ప్రణాళికలను విరమించుకోవడం జరిగేది.  అయితే ఇప్పుడు మంత్రి లోకేష్ కారణంగా.. రాష్ట్రానికి పంపెనీలు రావడమే కాదు,  కొత్త పెట్టుబడుల గురించి చర్చ జరుగుతోంది. మామూలుగా ఏ కంపెనీ కూడా,  రాజకీయాల ఆధారంగా తమ ఇన్వెస్ట్ మెంట్లు చేయదు. వ్యాపార ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభ,  మార్కెట్ పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని నమ్మితేనే ఇన్వెస్ట్ చేస్తారు. లోకేష్  ఆ విశ్వాసాన్ని చూరగొన్నారు.  

Visakhapatnam IBM Office, Nara Lokesh IT Department, Vizag IT Hub, Andhra Pradesh IT Investments, IBM Job Opportunities

By
en-us Political News

  
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.