పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
కల్వకుర్తికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాలయంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం(నవంబర్ 6) గ్రామ శివారులోని శిథిల శివాలయాన్ని, అందులో ఉన్న భిన్నమైన మూడు నంది విగ్రహాలను, కప్పు రాలి పగిలిపోయిన మండపం, నిధుల వేటగాళ్ల గడ్డపారులకు బలైన గర్భాలయాన్ని పరిశీలించారు. చుట్టూ ప్రాకారంతో ఉన్న శిధిల శివాలయాలను పదిలపరిచి, నంది శిల్పాలను గ్రామంలో పీఠాలపై నిలబెట్టి కాపాడుకోవాలని శివ నాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం గ్రామంలోని శివాలయం ధ్వజస్తంభం పీఠం పైన 6 అంగుళాల ఎత్తు నాలుగు అంగుళాల వెడల్పు రెండు అంగుళాల మందంగల సున్నపురాతితో చెక్కిన సూక్ష్మ ఆంజనేయ విగ్రహం, అదే కొలతలతో గణేష్ విగ్రహం ఉన్నాయని, విజయనగర కాలానికి చెందిన 400 ఏళ్ల నాటి చారిత్రక ప్రాధాన్యత గల ఈ అరుదైన చిన్న శిల్పాలను కాపాడుకొని, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల ముత్యాల రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-400-years-old-micro-statue-of-anjaneya-36-187985.html
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
జగన్ మీడియా తప్పుడు రాతలపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు.
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రీడా నగర నిర్మాణం కూడా ఒక భాగం చేసిన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు ధోనీ చంద్రబాబు భేటీకి అత్యంత ప్రాధాన్యత కలగడానికి కారణమైంది.
టోలి చౌక్ వద్ద జిప్టో డెలివరీ బాయ్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు.
ఆంధ్ర గ్రంథాలయం నిర్వాహకులను అభినందిస్తూ ఎన్టీఆర్ స్వదస్తూరితో రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసిన స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు
కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఈ స్కామ్ బయటపడగానే అమర్ దీప్ తన ఛార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయాడు. దీంతో తెలంగాణ పోలీసులు అమర్ దీప్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ముంబై వెళ్లి అమర్ దీప్ ను అరెస్టు చేశారు.