జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు : మంత్రి సవిత
Publish Date:Jan 6, 2026
Advertisement
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. మాజీ సీఎం జగన్ మానసిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందని, ఆయనకు లండన్ మందులు పని చేయనట్లుందని అన్నారు. వైయస్సార్ కడప జిల్లా వీరపునాయుని పల్లె ఉల్లి రైతులకు నష్ట పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఏపీని తానే అభివృద్ధి చేసినట్లు జగన్ భ్రమలో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు తానే నిర్మించానని, విశాఖకు డెటా సెంటర్ ను కూడా తెచ్చింది ఆయనేనని జగన్ చెప్పుకోవడం ఆయన దిగజారిన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుదేనన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం జగనేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఆయన అసమర్థత వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. రైతుల పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వేరాళ్లపైనా జగన్ తన బొమ్మను ముద్రించుకుని రైతులను, భూ యజమానులు భయబ్రాంతులకు గురిచేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు. పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ బొమ్మను తొలగించి, రాజముద్ర వేసి రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించామన్నారు. రైతులకు తమ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించామన్నారు. అయిదేళ్లలో జగన్ అయిదు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి యూనిట్ పై 13 పైసల చొప్పున్న ట్రూ అప్ ఛార్జీలు తగ్గించిందన్నారు.
*జగన్ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు
http://www.teluguone.com/news/content/onion-farmers-compensation-36-212119.html





