రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన కేటీఆర్..!
Publish Date:Sep 3, 2026
Advertisement
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..! నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2003లో రైతుల సమస్యల పరిష్కారం కోసం అప్పటి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. నీటి కోసం అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పారు.అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ.. ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 14లోపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపట్టి.. ప్రభుత్వం నీటిని విడుదల చేసేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. (KTR, KTR Padayatra, KTR Farmers Protest, Nagarjuna Sagar, Nagarjuna Sagar Left Canal, Farmers Issues, Telangana Farmers, KTR Warning, BRS, KCR, Kodad, Halia, Miryalaguda, Irrigation Water, Telangana News, Telugu One, Telugu News)
http://www.teluguone.com/news/content/(ktr-24-230634.html





