గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ.. అధికారికంగా కొండా సురేఖ బర్తరఫ్..!

Publish Date:Sep 3, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటించింది. కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ప్రెస్ కమ్యూనికేలో వెల్లడించారు. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. 

ఈ మేరకు 2026 సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి రాజ్‌భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.దీంతో కొండా సురేఖ ఇకపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగరు. అయితే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడానికి దారితీసిన కారణాలను మాత్రం అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు వెలువడిన ప్రకటనతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఈ పరిణామం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా వెళ్లారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అంశంపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. ఆమె బర్తరఫ్‌కు దారితీసిన పరిస్థితులను రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం ఎదురుగానే గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు తెలిసింది.

 

 

(CM Revanth Reddy, Konda Surekha, Telangana Politics, Telangana Cabinet, Konda Surekha Dismissal, Telangana Governor, Shiv Pratap Shukla, Lok Bhavan, Revanth Reddy Meeting, Telangana Government, Telugu one, Telugu news)
 

By
en-us Political News

  
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.