ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు.. డ్రాఫ్ట్ నోటిఫికేషన్

ములుగు జిల్లాకు సమ్మక్క సారలక్క పేరు పెట్టాలని మంత్రి సీతక్క విజ్ణప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలక్క జిల్లాగా మార్చడంపై అభ్యంతరాల స్వీకరణకు బుధవారం (జులై 3) గ్రామ సభలు నిర్వహించనున్నారు.

పేరు మార్పుపై ప్రజల అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో ఈ గ్రామ సభలలో స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తరువాత ప్రభుత్వం పేరుమార్పుపై తుది నిర్ణయం తీసుకుంటుంది.