4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం (జులై4)న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటించనున్నాయి. నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీకేజీకి నిరసనగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్వో, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్ నకు పిలుపునిచ్చాయి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మోడీ హయాంలో గత ఐదేళ్లలో 65 పరీక్ష పేపర్ల లీజేజీ ఘటనలు జరిగాయని పేర్కొన్న విద్యార్థి సంఘాలు, దీనిపై పార్లమెంటలో చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. పేపర్ల లీకేజీపై మోడీ స్పందించాలని డిమాండ్ చేశాయి.