అమ్మతో ఫస్ట్ రైడ్ లో ఎంజాయ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్


తన ట్రెండీ సాంగ్స్ తో యూత్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళను కూడా ఒక ఊపు ఊపేసే  రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలుసు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తనకో సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రేంజ్ లో టాలీవుడ్ ని ఊపేసిన  ‘నాటు నాటు’సాంగ్  కు తన గాత్రం అందించి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో భాగమయ్యాడు కూడా. అలా రాహుల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అక్కడ కూడా హిస్టరీ క్రియేట్ చేసాడు. తెలుగులో మాస్ సాంగ్స్‌ ఎన్నో పాడాడు. రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్, మహర్షి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు.  

బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను  గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. అలాంటి రాహుల్ టైం దొరికితే తన ఫామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక వాళ్ళ అమ్మను తీసుకుని ఛాపర్ లో రైడ్ కి తీసుకెళ్లాడు అలాగే ఆస్ట్రేలియా, మెల్బోర్న్ తిప్పి తీసుకొచ్చాడు. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.

ఇక ఇది చూసిన నెటిజన్స్ మాత్రం "పేరెంట్స్ ని సంతోషపెట్టడమే నిజమైన సక్సెస్ , తల్లి తండ్రుల మీద  ప్రేమ,  గౌరవం ఎంత ఉందొ  తెలిపే రీల్ ఇది. ఇది  వారి పెంపకంలో ఉన్న గొప్పతనం. హాట్స్ ఆఫ్ టు ప్రౌడ్ పేరెంట్స్, సూపర్ వావ్ వేరీ నైస్ , ఇదే నిజమైన జీవితం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఐతే తాను రాజకీయాలకు చూలా దూరం..ఇండస్ట్రీలో చేయాల్సిన పని చాలా ఉంది అంటూ ఆ న్యూస్ నమ్మొద్దంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు.